పాలకూరతో “spinach” అధిక బరువును తగ్గించుకోవచ్చు

Written by 24newsway.com

Published on:

పాలకూరతో “spinach” అధిక బరువును తగ్గించుకోవచ్చు పాలకూర వలన ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే పాలకూరలో చాలా పోషక విలువలు ఉన్నాయి. పాలకూర అధిక పోషక విలువలతో ఉండి తక్కువ క్యాలరీలతో ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న ప్రతి ఒక్కలు పాలకూరతో బరువు తగ్గవచ్చు. పాలకూరలో a విటమిన్ k విటమిన్ c విటమిన్ మరియు ఇనుము మరియు మెగ్నీషియం వంటి పోషకాలు చాలా బాగా ఉంటాయి.

పాలకూర “spinach” ద్వారా ఎలా బరువు తగ్గుతారు:

పాలకూర “spinach” లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని వలన బరువు తగ్గడానికి ఎంతో దోహదం చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లకు తక్కువ క్యాలరీ ఉన్న కంటెంట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కప్పు పాలకూరలో సుమారు 7 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీనిబట్టి చెప్పొచ్చు ఈ పాలకూరలో ఎంత తక్కువ క్యాలరీస్ ఉంటాయని మనకు తెలుస్తోంది. తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల మనం బరువు తగ్గడానికి చాలా దోహదం చేస్తాయి. తక్కువ క్యాలరీస్ ఉన్నాయని పాలకూర ను తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ పాలకూరల్లో మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా పాలకూర తీసుకోవడం వలన కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది.

పాలకూర “spinach”లో మన శరీరానికి అవసరమయ్యే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో జీర్ణ క్రియ కు చాలా బాగా సహాయపడుతుంది. ఫైబర్ మన శరీరంలో ఉండడం వలన తక్కువ అన్నం తిన్న గాని ఎక్కువ అన్నం తినే అంత తృప్తిని కలిగిస్తుంది. దీనివలన మన శరీరం ఎక్కువ అన్నం తిన్నంత ఫీలింగ్ కలగడం వలన మనము ఆహారం ఎక్కువ తీసుకోనవసరం లేదు. అలాగే పాలకూరను అన్నంలో చేర్చుకోవడం వలన కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది. దానివలన మన బరువు నియంత్రణలో ఉంటుంది. పాలకూర రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గించే విషయంలో మనకు తెలవకుండానే పాలకూర మనకు సహాయం చేస్తుంది.

పాలకూర వల్ల ప్రయోజనాలు :

పాలకూర లో ఆక్సిడెంట్ అధికంగా ఉండడం వలన ఆక్సిడేటివ్ స్టేష్ ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. పాలకూర రోజులు తీసుకోవడం వల్ల మన శరీరంలోని కణజాలాన్ని రిపేరు చేస్తుంది. మన కణజాలానికి ఏ విధమైన నష్టం జరగకుండా కాపాడుతుంది. పాలకూరని రోజు వాడడం ద్వారా మన శరీరంలో వాపును తగ్గిస్తుంది అలాగే మెటాలిజాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలకూర రోజు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి ని చాలా బాగా పెంపొందిస్తుంది. ఇలా పాలకూరని రోజు మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా రకమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం మీ ఆహారంలో పాలకూరని చేర్చండి ఆరోగ్య వంతులుగా ఉండండి.

Read More

🔴Related Post