ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరో మైలురాయి దిశగా ‘spirit movie’

Written by 24newsway.com

Published on:

గ్లోబల్ స్టార్ Prabhas ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న స్టార్‌గా దూసుకుపోతున్నారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లే కథలు ఎంచుకుంటూ ప్రభాస్ తన బ్రాండ్ విలువను మరింత పెంచుకుంటున్నారు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న spirit movie తో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్నారు.

‘స్పిరిట్’ ఒక సీరియస్ కాప్ స్టోరీ:

సందీప్ రెడ్డి వంగా ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్న ఒక మాటే సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. అదే  ఇది ఒక సీరియస్ పోలీస్ స్టోరీ. ఈ spirit movie prabhas తన సినీ కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా, పీరియాడిక్ వారియర్‌గా కనిపించిన ప్రభాస్… ఈసారి మాత్రం పూర్తిగా రా అండ్ రస్టిక్ కాప్ అవతార్‌లో ప్రేక్షకులను షాక్ ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

sandeep vanga మార్క్ ఇంటెన్సిటీ:

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో హీరో క్యారెక్టరైజేషన్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు Sandeep Reddy Vanga ఈసారి ప్రభాస్ క్యారెక్టర్‌ను మరింత ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వంగ మార్క్ అంటే రా ఎమోషన్స్, డార్క్ టోన్, రియలిస్టిక్ వైలెన్స్. ఇవన్నీ ‘స్పిరిట్’లో మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని టాక్.

 పాన్ వరల్డ్ రిలీజ్ ఇండియన్ సినిమాకి మరో స్టెప్ :

‘స్పిరిట్’ను కేవలం పాన్ ఇండియా మూవీగా కాకుండా ఒక Pan World Film గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల కానుంది. ఇది ప్రభాస్ గ్లోబల్ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 స్టార్ క్యాస్టింగ్ సినిమాకు మరింత బలం :

ఈ భారీ ప్రాజెక్ట్‌లో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందని సమాచారం. అలాగే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి పవర్‌ఫుల్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారనే వార్త సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

 వైరల్ పోస్టర్ హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది:

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వాయిస్ నోట్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అయితే అభిమానులకు పిచ్చెక్కించింది.షర్ట్ లేకుండా, ఒంటి నిండా గాయాలతో నిలబడ్డ ప్రభాస్… పక్కన త్రిప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తూ కనిపించడం, చేతిలో మద్యం బాటిల్ ఉండటం… ఈ లుక్ ప్రభాస్ కెరీర్‌లోనే నెవర్ బిఫోర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

spirit movie release date :

ఇటీవల వరకూ ‘spirit movie ’ 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందనే ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా మేకర్స్ ఈ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

మార్చి రిలీజ్ బాక్సాఫీస్‌కు పర్ఫెక్ట్ టైమింగ్ :

ట్రేడ్ వర్గాల ప్రకారం మార్చి 5 రిలీజ్ సినిమాకు భారీ ప్లస్ అవనుంది.మార్చి 6న మహా శివరాత్రి, ఆ తర్వాత ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు రావడం వల్ల ఓపెనింగ్‌కు భారీ అడ్వాంటేజ్ ఉంటుంది.అంతేకాదు, ఆ తర్వాత రంజాన్, హోలీ, గుడ్ ఫ్రైడే, వరుస వీకెండ్లు రావడం వల్ల సినిమా లాంగ్ రన్‌లో భారీ Box Office Collection రాబట్టే అవకాశం ఉందని అంచనా.

రూ.2000 కోట్ల టార్గెట్ సాధ్యమేనా?

prabhas స్టార్ పవర్, సందీప్ రెడ్డి వంగా క్రేజ్, పాన్ వరల్డ్ రిలీజ్, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఇవన్నీ కలిస్తే ‘స్పిరిట్’ ₹2000 కోట్ల కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. ఇది అతిశయోక్తి అనిపించినా, ప్రభాస్ గత సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే అసాధ్యం కాదనే చెప్పాలి.

spirit movie ఇండియన్ సినిమాకు గేమ్ ఛేంజర్?

మొత్తంగా చూస్తే ‘స్పిరిట్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఇది ప్రభాస్ కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో ఒక గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చూడాలంటే 2027 మార్చి 5 వరకు వేచి చూడాల్సిందే.

Read More

🔴Related Post