sreeleela latest movie news : తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీ లీల తన నటనతో అందరినీ ఆకర్షించుకున్నది. తను వరుస సినిమాలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తెలుగు ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది వరుస సినిమాలతో శ్రీ లీల నటిస్తుంది. యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం ఆమె నటించింది. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందని చెప్పాలి ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీ లీలకు ఆఫర్లు తగ్గాయని చెప్పుకోవచ్చు.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ హిందీ భాషల్లో ఈమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కి కూడా శ్రీ లీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం “దిలర్” మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీ లీలని హీరోయిన్గా తీసుకున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో శ్రీ లీల ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో కార్తీక్ ఆర్యన్ తో శ్రీ లీల నటించింది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఆమెకు అదృష్టం వచ్చినట్టే.
sreeleela latest movie news ఇదిలా ఉంటే శ్రీ లీలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. శ్రీ లీల బాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉన్నట్టు అక్కడ మీడియా అనుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేసింది. దీనితో శ్రీ లీల అతనితో ప్రేమలో ఉందని అంత ఫిక్స్ అయిపోయారు. ఇది ఇలా ఉంటే గతంలో ఇంటర్వ్యూలో శ్రీ లీల మాట్లాడుతూ ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారని అడిగిన ప్రశ్నకు శ్రీ లీల అవుననే సమాధానం ఇచ్చింది. దీంతో ఈ అమ్మాయి ఇబ్రహీంఖాన్తో ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తుంది. మరి దీనిపై శ్రీ లీల ఎలా స్పందిస్తుందో చూడాలి.