Srisailam Reservoir Water Level Rising: శ్రీశైలానికి భారీ వరద నీరు వస్తుంది. కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాని ఫలితంగా గద్వాల దగ్గర ఉన్న జూరాల ప్రాజెక్టు వరద నీటితో నిండిపోయి నిండు కుండల మారింది. ఇవాళ జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట సాయికి చేరుకుంది.
జూరాల ప్రాజెక్టులో నీరు గరిష్ట సాయికి చేరుకోవడంతో అక్కడ అధికారులు 10 గేట్లు ఎత్తి వేయడం జరిగింది. అక్కడ నుంచి కృష్ణా నది నీరు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా నీళ్లు రావడం జరుగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ వరద నీరు పొంగుతూ శ్రీశైలం రిజర్వాయర్కు చేరుకోవడం జరుగుతుంది ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్ లో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా కర్ణాటక మహారాష్ట్ర లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి దానితో ఇటు కృష్ణ నదికి అటు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా కృష్ణా నది గోదావరి నది వరద పోటుకి గురి కావడం జరుగుతుంది. అలాగే కృష్ణానది నది యొక్క ఉపనదులైన గట ప్రభా, మల ప్రభ, బీమా, తుంగ భద్ర నదులు సైతం పొంగి పోల్లడం జరుగుతుంది .
కర్ణాటకలోని ఉత్తర కన్నడ బెలగారి, హవేరి, విజయపుర మరియు బళ్లారిలో అది భారీ వర్షాలు కురవడం జరిగింది. ఈ ప్రాంతాలన్నీ కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతాలు అక్కడ భారీ వర్షాలు కురవడం వల్ల త్రిషా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దీనితోపాటు మహారాష్ట్రలో కూడా కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాలలో కూడా భారీగా వర్షాలు పడడం వల్ల కృష్ణా నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా కృష్ణ నది పొంగి పొర్లుతుంది.
కర్ణాటకలో కృష్ణానది పరివాహక ప్రాంతాలలో భారీగా వర్షాలు పడటం వలన అక్కడ కృష్ణా నదిపై కట్టిన ప్రాజెక్టులన్నీ నిండిపోవడం జరిగింది. అక్కడ ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నీటిమట్టం గరిష్ట సాయికి చేరుకోవడం జరిగింది. ఫలితంగా అన్ని ప్రాజెక్టుల గేట్లు అక్కడ అధికారులు ఎత్తివేయడం జరిగింది. ఫలితంగా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
ఫలితంగా ఆ ప్రభావం తెలంగాణ మీద పడ్డది.తెలంగాణలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో జూరాల ప్రాజెక్టు యొక్క పది గేట్లు ఎత్తివేయడం జరిగింది. అక్కడ నుంచే కృష్ణ వరద నీరు అన్నది పొంగుకుంటూ Srisailam రిజర్వాయర్ కు చేరుకోవడం జరుగుతుంది. శ్రీశైలం కి భారీగా కృష్ణ వరద నీరు రావడం వలన క్రమంగా రిజర్వాయర్ నిండడం జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులు వరద నీరు ఇలాగే వచ్చినచో శ్రీశైలం రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండడం జరుగుతుంది అని నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.