SSMB29 Latest Updates: గరుడ గా వస్తున్న మహేష్ బాబు

Written by 24newsway.com

Published on:

SSMB29 Latest Updates: గరుడ వస్తున్న మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతుందని మనందరికీ తెలిసిన విషయమే. మహేష్ బాబు గారి 29వ సినిమా గా వస్తుంది రాజమౌళి మహేష్ బాబు మూవీ. ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు మహేష్ బాబు చాలా కసరత్తు చేస్తున్నాడు పొడవాటి జుట్టు బాడి కూడా పెంచుతున్నాడు ఇప్పటివరకు చూడని లుక్ లో మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కనిపిస్తాడని ఒక టాక్. అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబు గారు తన లుక్కుని మేకవర్ని మార్చుకోవడానికి చాలా కష్టరత్తులు చేస్తున్నాడు. లుక్కు కోసం జర్మనీ కూడా వెళ్లి వచ్చాడు మహేష్ బాబు గారు. ప్రస్తుతం ఈ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ మూవీని రెండు భాగాలుగా ఉండబోతుందని ఆల్రెడీ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం,

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ వస్తుందని మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూసినప్పటికీ వారి ఆశ నిరాశ గానే మారిపోయింది అయితే ఈ సినిమాకు పనిచేస్తున్న విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ విజయన్ తన ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది అందులో ఆయన బంగారు రంగులో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB 29 అని పేర్కొన్నారు దీంతో ఈ సినిమాకు గరుడ అనే పేరు పెట్టబోతున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

కొంతకాలం క్రితం దర్శకుడు రాజమౌళి గారు గురించి చెప్పారు బాహుబలి సినిమా తర్వాత తాను చేయబోయే ప్రాజెక్ట్ గరుడ అన్నారు అయితే అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు తారక రామ్ చరణ్ తో ఆర్ ఆర్ సినిమా చేశారు తాజాగా విజయన్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం రాజమౌళి అనుకుంటున్న గరుడ ఇదేనా కాదా అనే విషయంలో మాత్రం ఇంకా ఎవరికీ స్పష్టత అనేది రాలేదు దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కే ఎల్ నారాయణ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు టైటిల్ పై చిత్ర నిర్మాణ సంస్థల నుంచి ఇంత వారికి ఎటువంటి ప్రకటన రాలేదు అలాగే రాజమౌళి గారు కూడా స్పష్టంగా టైటిల్ గరుడ అనే విషయం ఇంతవరకు తెలియజేయలేదు.

రాజమౌళి మహేష్ బాబు సినిమాకు మూడు సంవత్సరాల సమయం:

SSMB29 Latest Updates. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు గారు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా మిశ్రమ ఫలితాలు మాత్రమే అందుకుంది త్రివిక్రమ్ దర్శకత్వం పై మహేష్ బాబు అభిమానులు తీవ్ర సాయిలు మండిపడడం కూడా జరిగింది అప్పటినుంచి ఇప్పటివరకు మీడియా ముందుకు త్రివిక్రమ్ గారు రాలేదు రాజమౌళితో చేయబోతున్న సినిమాకు మూడు సంవత్సర సమయం పడుతుందని ఒక అంచనా. ఈ సినిమాను రాజమౌళి గారు పాన్ వరల్డ్ రేంజ్ లో చిత్రీకరించబోతున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్ తో పాటు ఇండియన్ యాక్టర్స్ కూడా నటిస్తారని ఒక వార్త హల్ చల్ చేసింది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు గానీ రాజమౌళి మహేష్ బాబు గారి సినిమా అమెరికా అడవుల నేపథ్యంలో ఉంటుందని మాత్రం రాజమౌళి తండ్రి గారు విజయేంద్ర ప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది. చూడాలి మహేష్ బాబు రాజమౌళి సినిమా ముందు ముందు ఇంకా ఎన్ని అంచనాలను రేకెత్తిస్తుందో.

Read More>>

Leave a Comment