summer foods and drinks

Written by 24 News Way

Published on:

summer foods and drinks : వేసవికాలంలో శక్తినిచ్చే ఆహారం ఏంటో తెలుసుకుందాం. వేసవికాలంలో ఎండ దెబ్బకు శరీరం డిహైడ్రేట్ అవ్వడం వల్ల శరీరం శక్తిని కోల్పోయి నిరాశంగా ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటివారు ఈ వేసవి కాలంలో యాక్టివ్ గా ఉండటానికి శక్తినిచ్చే ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.

అరటి పండ్లు
అరటి పండ్లు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది అరటి పండ్లు పొటాషియం కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి వీటిని ఫ్రీ వర్కౌట్ ఫుడ్ గా తీసుకోవచ్చు.

గ్రీన్ టీ
గ్రీన్ టీ మనకు కావలసిన శక్తిని అందిస్తుంది గ్రీన్ టీ తాగితే ఇది మన శరీరంలో అలసటను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది వ్యాయామం చేసేటప్పుడు శక్తి స్థాయిలను కూడా ఇది పెంచుతుంది కనుక ఈ వేసవి కాలంలో గ్రీన్ టీ తాగడం చాలా మంచిది.

పాలకూర
పాలకూరలో ఉండే ఐరన్ శరీరంలో ఉండే అలసటను తీసివేసి శక్తివంతులుగా చేస్తుంది.

డాక్టర్ చాక్లెట్ summer foods and drinks
డార్క్ చాక్లెట్ చిన్న ముక్కను ప్రతిరోజు తింటే శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది ఇది యాంటీ ఆక్సిడెంట్లను శరీరానికి అందిస్తుంది అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది.

ఓట్స్
ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఓట్స్ తిన్న తర్వాత మన శరీరంలో శక్తి పెరుగుతుంది నీకు ఎండాకాలంలో అలసటతో బాధపడేవారు శక్తి తక్కువ ఉందని అనుకునేవారు ఈ ఓట్స్ తినడం వల్ల మంచి శక్తిని పొందుకుంటారు.

నీరు
వేసవికాలంలో ముఖ్యంగా నీరు ఎక్కువ తాగడం మంచిది. శరీరం హైడ్రేటుగా ఉంచుకునేందుకు నీరు ఎక్కువ తాగాలి. వీటితోపాటు కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు.

ఇతర జాగ్రత్తలు 
బయటకు వెళ్లేటప్పుడు టోపీ సన్ గ్లాసెస్ గొడుగు ఇలాంటివి ఉపయోగించుకోవడం మంచిది ముఖాన్ని తరచూ చల్లటి నీటితో కడుక్కోవాలి.

గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యం సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న దగ్గర్లో ఉండే వైద్యులను సంప్రదించడం ఉత్తమమైనదిగా తెలియజేస్తున్నాము దీన్ని మీరు గమనించగలరు.

🔴Related Post