Kanguva movie ప్రమోషన్ లో హీరో సూర్య

Written by 24newsway.com

Published on:

Kanguva movie ప్రమోషన్ హీరో సూర్య ఈరోజు నుంచి పాల్గొనడం జరుగుతుంది. హీరో సూర్య లేటెస్ట్ నటిస్తున్న మూవీ కంగువా.ఈ మూవీ శివ దర్శకత్వం వహించడం జరుగుతుంది. కంగువా మూవీ మీద మొదలు పెట్టినప్పటి నుంచి భారీ అంచనాలను నెలకొనడం జరిగింది. ఈ మూవీని హీరో సూర్య గారి ఫస్ట్ తెలుగు స్ట్రైట్ మూవీ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మూవీని స్టూడియో గ్రీన్ తో పాటు యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ లెవెల్ లో నిర్మించడం జరుగుతుంది. కంగువా మూవీ నీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు.

Kanguva movie యొక్క ప్రమోషన్ ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాను మొదటగా ఢిల్లీ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో కంగువా మూవీ ప్రమోషన్ సందర్భంగా హీరో సూర్య గారు వందమంది అభిమానులతో ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సెల్ఫీలో హీరో సూర్య గారితో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దిశా పటాని మరియు విలన్ గా నటించిన బాబీ డియల్ కూడా ఉన్నారు. పోయిన వారము గంగవ్వ మూవీ ప్రమోషన్ బాంబేలో కూడా జరిగింది.

హీరో సూర్య గారు నటించిన కంగువ మూవీ యొక్క ఆడియో లాంచ్ ను భారీ లెవల్లో ఈ నెల 26వ తేదీన వేవ్ మీడియా జరిపించబోతుంది. అలాగే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక అడవిలో రెండు భయంకరమైన తెగల మధ్య జరిగే యుద్ధం లా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సినిమాలో హీరో సూర్య గారి లుక్కు చాలా బాగా ఉంది అలాగే విలన్ గా నటించిన బాబీ డియోల్ గారి లుక్కు ని చూస్తున్నా కానీ చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నారు ఇద్దరూ. అలాగే ఈ మూవీ ని తమిళంలో మరియు తెలుగులో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు ఎందుకంటే తమిళంలో స్టూడియో గ్రీన్ సంస్థ ఉంది కాబట్టి తెలుగులో uv క్రియేషన్స్ ఉండడం వల్ల విడుదలకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు. కానీ హిందీ మార్కెట్లో ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తారు అనేది ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న.ఎందుకంటే హిందీ మార్కెట్ అన్నది చాలా పెద్దది అక్కడ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా ఏదైనా మంచి డిస్ట్రిబ్యూట్ సంస్థ నుంచి విడుదల చేయడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్అవుతుంది. దీనికి ఉదాహరణ రీసెంట్ గా ఎన్టీఆర్ గారు నటించిన దేవర మూవీని కరణ్ జోహార్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అక్కడ దేవర మూవీ సుమారు 100 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. అలాగే కంగువా మూవీ కూడా భారీ లెవెల్ లో విడుదలయితే సినిమాకి కొంచెం మంచి టాక్ వచ్చేసాలు వందల కోట్ల వసూలు చేయడం గ్యారంటీ.

ఎందుకంటే సౌత్ ఇండియా సినిమాలు అందులో ముఖ్యంగా తెలుగు సినిమాలు అంటే నార్త్ ఇండియన్ ప్రేక్షకులు భారీ లెవెల్ లో ఎదురు చూడడం జరుగుతుంది.అందుకే అక్కడ నార్త్ ఇండియన్ జనాలకు కొంచెం కనెక్ట్ అయినా సరే వందల కోట్లు వసూలు చేయడం గ్యారంటీ. కంగువా మూవీ గురించి ఇంకో విషయము చెప్పాలంటే ఈ కంగువా మూవీ పార్ట్ 2 మరియు పార్ట్ 3 యొక్క స్టోరీ కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నదని తెలుస్తుంది. కంగువా మూవీ పార్ట్ 1 విడుదలై విజయం సాధిస్తేనే పార్ట్ 2 పార్ట్ 3 సినిమాలు నిర్మిస్తామని ఆ నిర్మాణ సంస్థ ఆల్రెడీ తెలియజేయడం జరిగింది.అయితే చూడాలి నవంబర్ 14 వ తారీఖున ఈ సినిమా విడుదలై ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో. మొదటి పార్ట్ ఎంత ఎక్కువగా హిట్ అయితే ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 2 పార్ట్ టూ 3 సినిమాలను కూడా మనము చూడవచ్చు.అంతా నవంబర్ 14 విడుదలయ్యే కంగువా మూవీ రిజల్ట్ మీదనే ఆధారపడి ఉన్నది. చూడాలి సూర్య గారు మళ్ళీ తెలుగులో కం బ్యాక్ అవుతారని ఆశిస్తున్నాము.

Read Movie

Leave a Comment