Symptoms of cholesterol in the body : శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఉదయం పూట కొన్ని లక్షణాలు కనిపిస్తాయి…కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఉదయం పూట కొన్ని లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అంటున్నారు. వైద్య నిపుణులు ఈరోజుల్లో జీవన శైలిలో మార్పులు ఆహారపు అలవాట్లు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు దేశంలో అధిక కొలెస్ట్రాల్ అధిక సమస్యగా మారింది అధిక కొలెస్ట్రాల్ ను డైస్లిపిదేమియా అని కూడా అంటారు. కొలెస్ట్రాల్ ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి.
తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్
హై డెన్సిటీ లిపో ప్రోటీన్
అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ మనకు చాలా మంచిది. దీనిని మంచి కొలెస్ట్రాల్ అంటారు.తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ మన ఆరోగ్యానికి మంచిది కాదు దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది రక్తదమనులో పేరుకుపోతుంది. అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ధమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు దీని కారణంగా గుండె పోటు స్ట్రోక్ ప్రమాదం. పెరుగుతుంది ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి అందుకే పెరిగిన కొలెస్ట్రాల్ ని తగిన సమయంలో గుర్తించాలి కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి అయితే ఉదయం పూట కొన్ని లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలంటున్నారు. వైద్య నిపుణులు ఉదయం పూట కొలెస్ట్రాల్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Symptoms of cholesterol in the body కాళ్ళ తిమ్మిరి
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు కాళ్లలో నొప్పి తిమ్మిరి అనిపించవచ్చు వాస్తవానికి కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా రక్తప్రసరణ సరిగా జరగదు ఇది కళ్ళాలో నొప్పి తిమ్మిర్ని కలిగిస్తుంది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సిరలు ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి అందుకే రక్తప్రసరణ జరగదు అందుకే కాళ్లలో నొప్పి తిమ్మిరి వస్తుంది అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించండి.
గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం శ్రేయస్కరం అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.
ఛాతి నొప్పి
ఉదయం నిద్ర లేచిన వెంటనే చాతిలో బరువుగా లేదా నొప్పిగా అనిపిస్తే మాత్రం జాగ్రత్త చాతిలో నొప్పి అనిపించడం అధిక కొలెస్ట్రాలకు సంకేతం వాస్తవానికి కొలెస్ట్రాల్ పెరుగుదల రక్తపాహానికి ఆటంకం కలిగిస్తుంది దీని కారణంగా ఆక్సిజన్ ఉన్న రక్తం గుండెకు చేరుకోదు దీని కారణంగా చాతి నొప్పి అనిపించవచ్చు మీకు అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి సరైన సమయంలో డాక్టర్ను సంప్రదించడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించవచ్చు.
అధిక చెమట
ఉదయం నిద్రలేచిన తర్వాత ఎక్కువగా చెమటలు పడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి అధిక చమట అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం కావచ్చు నిజానికి కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా సరఫరా చేయబడదు. దీనివల్ల చెమట పట్టవచ్చు ఈ సంకేతం కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించడం మంచిది.