Tandel సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా శోభిత ధూళిపాళ నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్ తో థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
దీంతో తాజాగా మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంది తండేల్ సక్సెస్ మీట్ నిర్వహించిన ఈవెంట్ కి నాగార్జున వచ్చారు. అలానే నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ కూడా ఈవెంట్లో సందడి చేశారు.
నాగచైతన్య కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 50 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన సినిమా నాలుగు రోజుల్లోనే 70 కోట్ల పైగా గ్రాస్ చేసింది దీంతో తాజాగా మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. అయితే ఈ ఈవెంట్ లో నాగచైతన్య భార్య శోభిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ ఈవెంట్ లోకి పద్ధతిగా చీరలో వచ్చారు. నాగచైతన్య పక్కన శోభిత ధూళిపాళ కూర్చొని ఈవెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మూవీ టీం నుంచి ప్రతి ఒక్కరూ నాగచైతన్య గురించి గొప్పగా చెబుతున్నారు. దీంతో శోభిత ఫేస్ కలకల్లాడిపోయింది. అలానే చైతు ని చూస్తూ శోభిత ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ కనిపించారు.
ఇక ఈ వేడుకకు నాగార్జునతో పాటు వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్తు కూడా వచ్చారు. శోభితతో పెళ్లి తర్వాత నాగచైతన్య చేసిన మొదటి సినిమా తండేల్ ఇది ఆయన కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ కావడంతో ఫాన్స్ ఫుల్ కుసిగా ఉన్నారు. త్వరలోనే Tandel 100 కోట్లు పోస్టర్ పడుతుంది.
అయితే ఈవెంట్ కి హీరోయిన్ సాయి పల్లవి రాలేకపోయారు బుజ్జి తల్లి పాత్రలో అద్భుతంగా నటించిన సాయి పల్లవి ఈవెంట్ కు రాకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది. అయితే రీల్ ప్లేస్ లో రియల్ బుజ్జి తల్లి సోబిత వచ్చి ఫాన్స్ లో జోష్ నింపింది. శోభితని ఇంట్లో బుజ్జి తల్లి అని పిలుస్తారని సంగతి ఇటీవల చైతన్య చెప్పారు.
అందుకే ఈ సినిమాలో బుజ్జి తల్లి అనే పదం వాడినప్పుడు పైగా ఆ పదంతో సాంగ్ కూడా రావడం పై శోభిత అలిగారంటూ చైతు చెప్పారు. ఇక Tandel విషయానికి కొస్తే ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రాణం పోసింది. బిజిఎం కూడా సినిమాలులో మరో స్థాయి నిలబెట్టింది. అలానే నాగచైతన్య తన కెరీర్ లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అందించారు.
మరోవైపు సాయి పల్లవి కూడా తన యాక్టింగ్ తో అభిమానులు మళ్ళీ మళ్ళీ ఏడిపించేసింది ఈ చిత్రంలో . జబర్దస్త్ మహేష్ సాహ పలువురు. కీలక పాత్రలు నటించారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు