కన్నీళ్లుతెపిస్తున్న NTRfan చివరి కోరిక. దేవరా మూవీ విడుదల వరకు నన్ను బతికించండి అంటున్నాడు. మన సౌత్ ఇండియాలో హీరోలని దేవుళ్ళ లాగా కొలుస్తారు. అలాంటి సంఘటనలు మనం చాలా చూసి ఉన్నాము. అయితే రీసెంట్ గా ప్రాణాపాయ స్థితిలో ఉన్న NTRfan చివరి కోరిక చూసి అందరి మనసులు కదిరిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక లలో కూడా మరియు తమిళ్లో కూడా ఎన్టీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హిందీలో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎన్టీఆర్ కి మాస్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆర్ఆర్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది.
అలాంటి ఎన్టీఆర్ కి అభిమానుల్లో ఒక వీరాభిమాని తన చివరి కోరికగా ఎన్టీఆర్ దేవర మూవీ విడుదల వరకు బతికించండి అని అనడం ఇప్పుడు అందర్నీ కన్నీళ్లు తెప్పిస్తుంది తిరుపతికి చెందిన కౌశిక్ అనే 19 సంవత్సరాల కుర్రాడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడటంతో తన వైద్యానికి 60 లక్షలకి పైగా ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పారట కానీ వారి కుటుంబీకులకు అంత స్తోమత లేదు అయితే కౌశిక్ ఇక తాను బతకనని అర్థం చేసుకొని తన చివరి కోరికగా దేవర సినిమా చూడాలని ఉంది అని ఈనెల 27 వరకు నన్ను బతికిస్తే చాలు అని కోరుకోవడం ఎన్టీఆర్ అభిమానులనే కాకుండా యావత్ తెలుగు అభిమానుల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది దీనితో ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎమోషనల్ గా కూడా మారింది మరి ఈ విషయాన్ని తారక్ వరకు తీసుకెళ్లే విధంగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి కౌశిక్ విషయంలో ఏమన్నా అద్భుతం జరుగుతే తప్పి కౌశిక్ బతకడు .అలాంటి అద్భుతం జరుగుతుందో లేదో చూడాలి . అద్భుతం కౌశిక్ విషయంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఎన్టీఆర్ గారికి ఈ విషయం తొందరగా తెలిసి ఎన్టిఆర్ గారు సహాయం చేసినచో కౌశిక్ బతకడం జరుగుతుంది. అది కూడా జరుగుతే చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ కౌశిక్ కు సహాయం చేసినట్లయితే ఎన్టీఆర్ పేరు తెలుగు ప్రజలలో చిరస్థాయిగా నిలుస్తుంది.
ఈనెల 27 తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర మూవీ థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ హీరో సైఫా అలీ ఖాన్ విలన్ గా నటించడం జరుగుతుంది. అలాగే హీరో శ్రీకాంత్ మరియు ప్రకాష్ రాజ్ మొదలగువారు ముఖ్యమైన పాత్రలు పోషించడం జరిగింది.. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ ఆర్తి బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది.