AI హబ్ గా తెలంగాణ: రేవంత్ రెడ్డి ప్రకటన

Written by 24newsway.com

Published on:

AI హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు వేదికగా ప్రపంచ AI సదస్సు నేటి నుండి రెండు రోజులపాటు జరుగుతుంది ఈ ఉదయం హైదరాబాదులోని హెచ్ ఐ సి సి లో ప్రపంచ AI సదస్సు ప్రారంభమైంది ప్రతి ఒక్కరి కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ అన్న ఇతివృత్తంతో రెండు రోజులు జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.

తెలంగాణలో AI డెవలప్మెంట్ కు 25 అంశాలతో ఒక రోడ్డు మ్యాప్:

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి పరిశోధనలను ప్రోత్సహించడానికి ఏఐ పర్యావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యులతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు అలాగే ఏఐ సిటీ లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు తెలంగాణలో ఏఐ డెవలప్మెంట్ కు 25 అంశాలతో ఒక రోడ్ మ్యాప్ ను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు.AI హబ్ గా తెలంగాణ.

AI టెక్నాలజీ పై సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్:

తెలంగాణ ప్రగతిలో ఏఐ కూడా భాగస్వామ్యం అవుతుందని ఈ మేరకు అనేక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు తన విజన్ తెలియజేయడం జరిగింది. వచ్చే ఐదేళ్లలో కోటి మందికి ఏ సేవలు అందించనున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు విద్యా వ్యవసాయ ఆరోగ్యం పరిశ్రమల వంటి రంగాల ను మెరుగుపరిచేందుకు ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. వివిధ రంగాలపై ప్రభావం వంటి పలు అంశాలను ఈ సదస్సులో లోతుగా చర్చించడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అవసరం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు:

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ఉపయోగానికి ఏఐ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతులకు కట్టుబడి ఉంటూనే ఏఐ వినియోగంపై అచ్చితమైన నియంత్రణలు అమలు చేయాలని భావిస్తున్నట్లు సంబంధిగా సంస్థలతో కలిపి పని చేస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది నిరంతరం ఆర్థిక అభివృద్ధి కోసం ఏఐను వినియోగిస్తున్నట్లు తెలియజేశారు రానున్న సంవత్సరాలలో రాష్ట్రం ఒక ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలని కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలంగాణ ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పేర్కొనడం జరిగింది.

పలు AI సంస్థలతో ఒప్పందాలు చేస్తున్న తెలంగాణ సర్కార్:

రాష్ట్రాన్ని ఏఐ బెస్ట్ పవర్ గా తీర్చిదిద్దనున్నట్లు హైదరాబాదులో ఏఐ సిటి ఉత్తమ పరిశోధన సృజనాత్మకత ప్రోత్సాహాంగా పనిచేస్తుందని మంత్రి చెప్పారు. ఏఐ సిటీలో ఏ ఐ స్కూల్ ఆఫ్ ఎక్స్లె లెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిగారు చెప్పారు ప్రతి డిపార్ట్మెంట్లో ఒక AI ఏజెంట్ ను నియమించడం జరుగుతుందని తెలియజేశారు పాఠశాల విద్యలో ఏఐ ను ప్రవేశపెట్టడం కూడా AI రోడ్ మ్యాప్ లో భాగమన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు AI సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.

Read More>>

Leave a Comment