ఈరోజు నుంచి 13 రోజులపాటు Dasara holidays ప్రకటించిన Telangana government :
దసరా పండగ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు అలాగే దసరా పండుగ ముందు వచ్చే బతుకమ్మ పండగ తెలంగాణ కు ప్రత్యేకమైన పండగ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే పువ్వులను కొలిచే పండగ బతుకమ్మ కోసం ఆడబిడ్డలు ఎంతగానో ఎదురు చూస్తారు మగ పిల్లలు అక్కాచెల్లెళ్ల కోసం అడవికి వెళ్లి తగ్గేడు గునుగు పువ్వులు తీసుకు రావడం జరుగుతుంది. ఆడబిడ్డలు ఆ పువ్వులతో బతుకమ్మను పేర్చి సాయంత్రం బతుకమ్మ ఆడడం జరుగుతుంది .
ఈ సాంప్రదాయం ఎప్పటినుంచో తెలంగాణలో కొనసాగుతుంది ఈ బతకమ్మ పండగను తొమ్మిది రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది 9వ రోజు పెద్ద బతుకమ్మ పండగ నిర్వహిస్తారు సద్దుల బతుకమ్మ రోజు పిల్లలు పెద్దలు వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది అలాగే బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆడబిడ్డలు అందరూ కలిసి ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుంది బతుకమ్మ ఆడుకోవడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ Dasara holidays ను ప్రకటించడం జరిగింది.
Telangana government ఈసారి పాఠశాలలకు 13 రోజులపాటు హాలిడేస్ ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 2 న Dasara holidays మొదలు కావడం జరుగుతుంది అక్టోబర్ 15న తిరిగి స్కూలు ప్రారంభమవుతాయి దీంతో పిల్లలు ఎక్కడికి వెళ్లాలి అనే ప్లాను కూడా చేసుకుంటున్నారు మరోవైపు హాస్టల్లో ఉన్న పిల్లలను తీసుకెళ్లేందుకు తమ తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి రావడం జరుగుతుంది బుధవారం నుంచి సెలవులకు కావడంతో చాలా పాఠశాలలు సోమవారం బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది కొన్ని పాఠశాలలో మంగళవారం సెలబ్రేషన్ చేసుకున్నాయి .
ఇక ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ నుంచి సెలవులు ప్రకటించినట్లు తెలుస్తుంది అటు వైపు ఏపీ ప్రభుత్వం కూడా దసరా సెలవులు ప్రకటించిన సంగతి మనకు తెలిసింది ఏపీలో అక్టోబర్ మూడు నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి మళ్లీ అక్టోబర్ 14 వ తారీఖున పాఠశాలలు ఓపెనింగ్ అవుతాయి. తెలంగాణ అంతట ఈరోజు నుంచి బతకమ్మ సంబరాలు మొదలు కావడం జరుగుతుంది అలాగే దసరా సంబరాలు కూడా మొదలు కావడం జరుగుతుంది.
ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో పండుగ వాతావరణం స్టార్ట్ అయిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని పోవడానికి తల్లిదండ్రులు కాలేజీలో వద్దకు చేరుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు అలాగే కాలేజీలకి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులందరూ తమ ఊర్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు దీనివల్ల బస్సుల రద్దీ కూడా పెరుగుతుంది అందుకే పండగ వాతావరణం మొదలైందని కూడా చెప్పవచ్చు .
మళ్లీ అక్టోబర్ 15వ తారీకు రోజు స్కూల్లో కాలేజీలో రీబోపెనింగ్ అవడం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తమ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట జరిగే బతుకమ్మ పండుగ కావడంతో చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది అలాగే ప్రతిష్టాత్మక దసరా పండుగ కూడా చాలా గ్రాండ్గా చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది.