Telangana Latest News: హస్తిన కు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Written by 24newsway.com

Updated on:

Telangana Latest News: హస్తిన కు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .తెలంగాణ మంత్రి వర్గ విస్తీర్ణకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం జరిగింది. ఇ సమయంలో కార్గే సమక్షం లో కేకే కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది .ఎల్లుండి తో ఆషాడ మాసం మొదలు కాబోతున్నది కావున దీంతో రేపు ఒక్క రోజే అవకాశం ఉండడంతో ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకొని రేపు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండనుందని సమాచారం.

Telangana Latest News

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

రేపు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కి వెళ్లడం కూడా జరిగింది. ఈ రాత్రి కి తిరిగి హైదరాబాది కు సీఎం రేవంత్ రెడ్డి గారు చేరుకోవడం జరుగుతుంది .ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త పిసిసి చీఫ్ మంత్రివర్గ విస్తరణ మరియు నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికే 11 మంది మంత్రులుగా ఉన్నారు .మరో ఏడు లేక ఎనిమిది మంది కి ఈ మంత్రివర్గ విస్తీర్ణంలో చోటు దక్కుతుంది. దీనిపై రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దల ఆధ్వర్యంలో చర్చించి కసరత్తు చేస్తున్నారు .టిపిసిసి చీఫ్ నియామకం పైన తుది నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం.

కాంగ్రెస్ హై కమాండ్ ఆమోదం

ఇటీవల ఐదు రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పర్యటించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇతర సీనియర్ నేతలు మరియు పార్టీ పెద్దలతో విస్తృతంగా చర్చించడం జరిగింది పలు సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు ఇవ్వనున్నట్లు మనకు అందుతున్న సమాచారం .రెడ్డి సామాజిక వర్గానికి 2 .వెలమ సామాజిక వర్గానికి 1 ,బీసీల కు ఒక మంత్రి పదవి దక్కి అవకాశం ఎక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై ఇప్పటికే చర్చలు జరిగి ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం మరియు కార్గే తో రేవంత్ రెడ్డి గారు బేటి కాబోతున్నారు .ఈ భేటీ లో మంత్రివర్గ విస్తరణ మరియు నూతన పిసిసి చీఫ్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.

కొత్తగా పదవులు దక్కేది ఎవరికి

రేపు కాక ఎల్లుండి ఆషాడమాసం మొదలు కాబోతున్నది దీంతో రేపు ఒక్క రోజే అవకాశం ఉండడంతో ఈ అంశాలపై ఇవ్వాళ తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రేపు ప్రమాణ స్వీకారం పూర్తి చేయించాలని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్లు తెలుస్తుంది .మంత్రివర్గ రేసులో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు మంత్రి నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది .మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహా పలువురు పేర్లు ఇందులో వినిపించడం జరుగుతుంది .దీంతో తుది జాబితాలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలలో ఉత్కంఠ పెరుగుతుంది.

Read More>>

Leave a Comment