వరదబాధితులకు విరాళం తెలుగుహీరోలు: ఏపీ తెలంగాణ వరద బాధితులకు భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన తెలుగు హీరోలు. రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ప్రాంతాలు నీయటం మునిగాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయింది అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో భారీ వర్షాల వలన ఆంధ్ర తెలంగాణ మధ్య ఉండే విజయవాడ హైవే కూడా దెబ్బతినడం జరిగింది దీనివలన రెండు రాష్ట్రాల కు మధ్య సంబంధం కూడా తెగిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో అటు ఏపీ గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ వరద బాధితులను ఆదుకోవడానికి తగిన అన్ని చర్యలు తీసుకుంటుంది.
ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులను స్వయంగా వెళ్లి కలవడం జరిగింది అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో మునిగిపోయిన ప్రాంతాలకు వెళ్లి వరద బాధితులను కలవడం జరిగింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో నదులు అన్ని పొంగిపొర్లుతున్నాయి ముఖ్యంగా విజయవాడ దగ్గర ఉన్న కృష్ణమ్మ పొంగి విజయవాడ సగం మునిగిపోయింది. అలాగే ప్రకాశం బ్యారేజీ కూడా డ్యామేజ్ అయితదని వార్తలు వచ్చాయి గాని దుర్గమ్మ దయవల్ల ఆది జరగలేదు. ఏపీలో చాలావరకు లంక డ్రామాలు లోతట్టు డ్రామాలు మునిగిపోవడం జరిగింది. అందరికీ తక్షణ సహాయం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అధికారులకు తెలియజేశారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తగినంత సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని బోట్స్ అండ్ హెలికాప్టర్స్ కావాలని అడిగిన వెంటనే అమిత్ షా గారు పంపించడం జరిగింది. రెండు రాష్ట్రాల గవర్నమెంట్ లేకకుండా తెలుగు హీరోలు కూడా రెండు రాష్ట్రాల్లో వరద బాధితులకు సహాయం చేయడం జరిగింది.వరదబాధితులకు విరాళం తెలుగుహీరోలు.
దీనితో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మన టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు అనేకమంది భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించడం జరిగింది. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు కోటి రూపాయలు వరద బాధితులకు ప్రకటించగా లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు రెండు కోట్ల రూపాయలు ఏపీ వరద బాధితులకు కోటి రూపాయలు తెలంగాణ వరద బాధితులకు కోటి రూపాయలు అందించడం జరిగింది.. అలాగే అల్లు అర్జున్ గారు కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకైతే వీళ్ళు ప్రకటించడం జరిగింది. ముందు ముందు ఇంకా కొంతమంది ప్రకటిస్తారని అంటున్నారు మహేష్ బాబు గారు కూడా కోటి రూపాయలు ప్రకటించడం జరిగిందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇలా కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభుత్వ లతోపాటు మన హీరోలు కూడా తమ వంతు సహాయం అందించడం ఒక గొప్ప విషయం గా చెప్పుకోవచ్చు. ఇదే కాదు ఎప్పుడైనా సరే మన టాలీవుడ్ హీరోలు తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినా ముందు ఉంటారని మనం చాలాసార్లు చూశాము. దట్ ఇస్ తెలుగు స్టార్స్ దట్ ఇస్ టాలీవుడ్ ఇండస్ట్రీ.