THE LADDYKILLER: ఇండియాలోనే అట్టర్ ప్లాప్ సినిమా: ఇండియాలోనే ఈ మూవీని మించిన అట్టర్ ప్లాప్ సినిమా లేదు అంటే నమ్ముతారా మీరు. ఇంతటి మంచి కళాకాండం తీసింది ఏ ఇండస్ట్రీలో అని మీరు చెప్పగలరా, అది మరి ఏదో ఇండస్ట్రీ కాదు ఇండియా లో మా ఇండస్ట్రీ నే రాజు అని చెప్పు కొనే విర్రవీగే బాలీవుడ్ ఇండస్ట్రీ. ఇంతటి కళాకాండంలో నటించిన హీరో హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఇండియాలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు నిర్మితమవుతుంటాయి అందులో కొన్ని సూపర్ హిట్గా నిలిస్తే మరికొన్ని అట్టర్ ప్లాప్ అవుతాయి సినిమా అన్న తర్వాత విజయాలు అపజయాలు అనేది సహజంగానే ఉంటాయి అయితే మన దేశంలో అత్యంత భారీ డిజాస్టర్ సినిమా ఒకటి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఈ సినిమాను మించిన అట్టర్ ప్లాప్ సినిమా లేదని చెప్పవచ్చు సుమారు ఈ మూవీని 45 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు నిర్మాతలు. కేవలం ఈ సినిమా 45000 మాత్రమే వసూలు చేసింది. చూశారా ఎంతటి కళాకాండమో ఈ సినిమా.
ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసిన దానికి ప్రమోషన్లు తప్పనిసరిగా చేయాలి ఆ ప్రమోషన్ల మీద ఆధారపడిన సినిమాలు కలెక్షన్లు కూడా వస్తాయి సినిమా బాగో లేకపోయినప్పటికీ కనీసం సగం డబ్బులు అన్న తిరిగి వస్తాయి ప్రమోషన్లు కూడా లేకుండా తిరకెక్కిన ఈ సినిమా పేరు దీ లేడీ కిల్లర్ 2023వ సంవత్సరంలో నవంబర్ మూడో తేదీన థియేటర్లో విడుదలైంది ఈ సినిమాలో బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్ మరియు భూమి పడ్నేకర్ నటించారు.
కొన్ని సంవత్సరాలు క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు ఏళ్లు దాటుకొని వస్తున్నా గానీ అనుకున్న బడ్జెట్ లెక్కలన్నీ దాటి షూటింగ్ మొత్తం పూర్తవ్వకుండానే విసుగు చెందిన నిర్మాతలు చివరికి సినిమాను విడుదల చేయడం జరిగింది. ఫలితం తెలిసిందే డిజాస్టర్ లకే డిజాస్టర్ సినిమా గా నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాను మించిన ప్లాపు లేదని అందరూ గ్యారెంటీగా చెప్తున్నారు ఇంతకన్నా దరిద్రమైన ప్లాప్ సినిమా భవిష్యత్తులో కూడా రాదని గ్యారెంటీగా చెబుతున్నారు దేశం మొత్తం మీద ఈ సినిమాకు 12 షోలు వేశారు తొలి రోజు 293 టికెట్లు అమ్ముడుపోయి 38000 రాగా చివరకు 45000 వచ్చాయి డిజిటల్ హక్కులు కూడా ముందు గానే అమ్మకానికి పెట్టారు డిసెంబర్లో స్ట్రిమ్మింగ్ కు చేయాలనే ఒప్పందం కుదరడంతో హడావిడి గా నవంబర్లో విడుదల చేయడం జరిగింది ఈ మూవీని డిజిటల్ హక్కులను నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకుంది అయితే ఇంతవరకు దీన్ని స్త్రిమ్మింగ్ చేయలేదు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా అర్జున్ కపూర్ భూమి ఇద్దరూ ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు చేయమని ముందే చెప్పడం జరిగింది. ఇంత దారుణమైన ఫలితం రావడానికి నిర్మాతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.