Chiranjeevi ఫామ్ హౌస్ విలువ మరి అంతనా

Written by 24newsway.com

Published on:

Chiranjeevi ఫామ్ హౌస్ విలువ ఎంతనో తెలుసా అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిరంజీవి గారు చాలా కష్టపడి తన స్వయంకృషితో సినిమా పరిశ్రమంలో మెగాస్టార్ గా ఎదిగాడు ఒక సందర్భంలో ప్రముఖ లెజెండరీ దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు గారు మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఏదైనా రాయాలంటే చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని రాయడం మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది అంతటి గొప్ప దర్శకుడు దాసరి నారాయణ రావు గారు ఈ విషయం చెప్పారంటే చిరంజీవి గారు తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎంతగా ఎదిగారనేది అలాగే ఎంతగా కష్టపడ్డారు అనేది మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాల ద్వారా తనకు వస్తున్న ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా చిరంజీవి గారు పొదుపు చేసుకుంటూ వచ్చారు.

అందులో భాగంగానే Chiranjeevi గారు మన సీనియర్ హీరో శోభన్ బాబు గారి బాటలోనే నడుస్తూ ఖరీదైన స్థలాలను చాలా కాలం క్రితమే కొనుగోలు చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో స్థలాలు మరియు భవనాలు చాలా కొనడం జరిగింది ఇవి కాకుండా ఆయనకు ప్రత్యేకంగా మూడు ఫామ్ హౌస్ లు ఉన్నాయి అని తెలుస్తుంది. ఆ ఫామ్ హౌస్ లో మొదటగా చెప్పుకునేది బెంగళూరు ఫామ్ హౌస్. బెంగళూరు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా దగ్గరలో ఒక ఫామ్ హౌస్ ఉంది అని మన అందరికీ తెలిసిన విషయమే అయితే దీని ఖరీదు సుమారు 35 కోట్ల రూపాయలుగా ఉంటుందని ఒక అంచనా చిరంజీవి గారు ప్రతి సంవత్సరం మెగా కుటుంబ సభ్యులంతా కలిసి సంక్రాంతి పండగను బెంగళూరు ఫామ్ హౌస్ కి వెళ్లి జరుపుకుంటారు దీని తర్వాత ఆయనకు హైదరాబాద్ కోకాపేటలో మరో ఫామ్ హౌస్ కూడా ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ధరలు పెరగకముందు ఆయన అక్కడ స్థలాలను కొనుగోలు చేయడం జరిగింది అలాగే ఆ స్థలంలో చాలా కాలం క్రితమే ఫామ్ హౌస్ నిర్మించుకోవడం కూడా జరిగింది.

Chiranjeevi గారి కోకాపేటలో ఉన్న ఫామోజు ఖరీదు ఎంతో తెలుసా:

హైదరాబాదులోని కోకాపేటలో స్థలాల ఖరీదు విపరీతంగా పెరగడంతో చిరంజీవి గారు కోకాపేటలో కొన్న స్థలాల విలువ సుమారు 200 కోట్లకు చేరిందని ఒక అంచనా .సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ కూడా చాలా వరకు అక్కడే జరిగింది ఆ సమయంలో సెట్స్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఆ ఫామ్హౌస్ వార్తల్లోకి వచ్చింది . అలాగే చిరంజీవి గారు తాజాగా ఊటీలో ఒక కొండపై ఐదు ఎకరాల స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది . ఆ ఐదు ఎకరాల స్థలంలో ఒక మంచి ఫామ్ హౌస్ ని నిర్మించాలని చిరంజీవి గారు నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే చిరంజీవి గారు కొన్న ఐదెకరాల స్థలం కు సుమారు 16 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో అక్కడికి చిరంజీవి మరియు మెగా కుటుంబ సభ్యులు వచ్చి రిలాక్స్ కోసం వస్తారని తెలుస్తుంది. చిరంజీవి గారికి కోకాపేట ఊటీ బెంగళూరు మూడు ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్ లా విలువ దాదాపు 300 కోట్లు అని ఒక ప్రముఖ పత్రిక పేర్కొనడం జరిగింది.

Read More

Leave a Comment