ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తే మీకు liver cancer వచ్చినట్టే. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఆరోగ్య అలవాట్లు మరియు మనం తినే ఆహారంలో కల్తీ ఎక్కువగా జరగడం దీనివల్ల 60 సంవత్సరాల కు వచ్చే రోగాలు ఇప్పుడు 20 సంవత్సరాలకే వస్తున్నాయి. మన తాతల కాలంలో స్వచ్ఛమైన ఆహారం స్వచ్ఛమైన గాలి ఉండటం వలన వాళ్ళు 100 సంవత్సరాల వరకు జీవించడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా వేరు. అందుకే మన పెద్దలు మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడం కూడా జరిగింది. ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలో మనకు తెలిసి ఉండాలి. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుందనేది జీవన సత్యం.
మన శరీరంలో కాలేయం అనేది ఒక ముఖ్యమైన భాగము అనే విషయం మనకు అందరికీ తెలిసిందే ఇది శరీరంలో చాలా పనులను చేస్తుంది. లివర్ సరిగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది.
మన శరీరంలో కాలేయం చేసే పనులు :
కాలేయం మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది అలాగే జీర్ణ క్రియ సరిగా జరగడానికి కూడా కాలేయం ముఖ్యపాత్ర వహిస్తుంది. వీటితోపాటు కాలేయం రక్తంలోని మలినాలను శుద్ధి చేయడంలో ఎంతో పనిచేస్తుంది. అలాగే వీటితోపాటు పైత్య రసాన్ని ఉత్పత్తి చేసి కొవ్వులను జీర్ణం చేయడానికి కూడా కాలేయం అనేది ఉపయోగపడుతుంది. వీటితోపాటు మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ ను గ్లైకోజన్ మార్చి నిల్వ చేస్తుంది.
కాలేయం మన శరీరానికి కావలసిన శక్తిని తయారుచేస్తుంది. కాలేయం సరిగా పనిచేయడం వలన శరీరంలోని హానికర మైన పదార్థాలను నిర్వీర్యం చేసి చెడు పదార్థాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. కాలేయం సరిగ్గా ఉంటేనే మనకు ఆరోగ్యం సరిగా ఉంటుందని వైద్యశాస్త్ర నిపుణులు ఎప్పుడో తెలియజేయడం జరిగింది. అందుచేత మన కాలేయం ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి ఆరోగ్యకరమైన అలవాట్లను మనము అలవాటు చేసుకోవాలి.
liver cancer వచ్చిందని చెప్పే సంకేతాలు :
ఈ మధ్యకాలంలో liver cancer మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా స్పీడుగా వ్యాప్తి చెందుతుంది. అందుచేత లివర్ క్యాన్సర్ వచ్చే సంకేతాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇందులో మొదటిది అసకమాత్తుగా బరువు తగ్గడం. కుడివైపు ఎగువన నొప్పి రావడం. అలాగే కండ్లు చర్మం పసుపు రంగులోకి మారడం. అంటే దాని అర్థం కామెర్లు రావడం. పొట్టలో కాళ్లలో వాపులు రావడం. వికారంగా ఉండడం. వాంతులు రావడం. ఎప్పుడు అలసటగా ఉండడం. శరీరం బలహీనంగా అనిపించడం. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నచో మీరు తక్షణమే జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే దగ్గర్లో ఉన్న డాక్టర్ కి చూపించు కోవడం ఇంకా మంచిది అశ్రద్ధ చేయొద్దు.