Tomato Health Benefits : ప్రపంచవ్యాప్తంగా టమాటో అన్నది వంటశాలలో చాలా ప్రధానమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఇది పోషకా ఆహారానికి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. సలాడ్లు జ్యూసులు కూరలు మరియు సూప్ల వంటి వివిధ వంటకాలకు కేంద్రంగా ఉన్న టమాటాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం ఉద్భవించింది అని మనకెప్పుడో తెలుసు. అలాగే టమాటాల లో ఉన్న గొప్ప పోషకాహారాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల అందిస్తాయని మన ఆయుర్వేద శాస్త్రం ఎప్పుడో తెలుసుకుంది అందుకే మన పెద్దవాళ్లు ఎక్కువగా టమాటాని పండించేవారు. మరియు టమాటాలతో ఎక్కువగా కూరలు చేసి మనకు చిన్నతనంలో పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే టమాటా వల్ల ఉపయోగం మన పూర్వీకులకు చాలా బాగా తెలుసు.
Tomato Health Benefits : చాలానే ఉన్నాయి. టమాటా లో విటమిన్ a k b b1 b3, b5, b6, b7, మరియు ఇనుము, పొటాషియం ,మెగ్నీషియం, జింకు మరియు పాస్ఫరస్ తో పాటు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో టమాటో నిండి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం 100 గ్రాముల పండిన టమాటా ను మనము తీసుకుంటే అందులోని విలువైన పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో చాలా దోహదపడతాయని తెలియజేయడం జరిగింది. అలాగే ముంబై కి చెందిన పోషకాహార నిపుణులు రమా దేశ్ పాండే టమాట వలన క్యాన్సర్ ను నివారణ గా పని చేస్తుందని కూడా తెలియజేయడం జరిగింది మరియు టమాటా ల ద్వారా సౌందర్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారు .అలాగే టమాటాల ద్వారా ఆరోగ్యం మరియు గుండె రక్షణకు కూడా టమాటాలు చాలా మేలు చేస్తాయని వెల్లడించడం జరిగింది. టమాటాల లో ఒక ముఖ్యమైన సమ్మేళనం లైకోపీన్ కొన్ని క్యాన్సర్లు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా తగ్గిస్తుంది అలాగే టమాటల ను ఉడికించినప్పుడు దాని ప్రభావం మరింత పెరుగుతుంది అని క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా టమాటా పెంచడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది.
టమాటాలను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలియజేయడం జరిగింది. టమాటాలను ఉపయోగించి చర్మం యొక్క ఆరోగ్యం మరియు దాని పందిరిని కూడా పెంచుకోవచ్చు. టమాటాలను ఉపయోగించి టమాటాలను మిక్సీలో గ్రైండ్ వేసి ఒక పేస్టులా చేసుకుని ముఖానికి చేతులకి ఫేస్ ప్యాక్ కూడా వాడడం జరుగుతుంది దీనివల్ల శరీరంలో తేమ పెరిగి మొహం కాంతివంతంగా ఏర్పడుతుంది. ఎక్కువమంది టమాటాను మొహానికి ఫేస్ ప్యాక్ గా వాడడం జరుగుతుంది మరియు కొంతమంది శర్మ ఆరోగ్యం కోసం టమాటా జ్యూస్ ని చేసుకుని రోజు పొద్దున ఒక గ్లాస్ తాగడం జరుగుతుంది. దానివల్ల శరీరంలో కావాల్సిన విటమిన్స్ అన్ని టమాట ద్వారా అందుతాయి.
అలాగే టమాటా ద్వారా ఫేస్ ప్యాక్ చేసుకునేవారు డైరెక్టు ఫేస్ కి ఫేస్ ప్యాక్ వేసుకోవడం కన్నా ఫస్ట్ చేతికి రాసుకొని అది మీ శరీరానికి పడుతుందా పడట్లేదా అని తెలుసుకొని మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలని మా సలహా. ఎందుకంటే టమాటా కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు అందుకే అలా చెప్పడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోగలరు. అలాగే టమాటా ద్వారా మధుమేహం నిర్వహణ మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది పరువు తగ్గడంలో టమాట చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మన ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలియజేయడం జరిగింది మరియు టమాట వలన ఐరన్ మరియు పొటాషియంతో పాటు విటమిన్ సి మరియు ఏ లు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి
టమాటాలు డయాబెటిస్ లో ఆస్తీకరణ ఒత్తిడిని కూడా తగ్గించడం జరుగుతుంది. కోమరిక్ యాసిడ్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్ వంటి సమ్మేళనాల ద్వారా ధూమపానం యొక్క హానికరమైన ప్రభావాలనుండి రక్షిస్తాయని అధ్యయనాలు మనకు సూచించడం జరుగుతుంది. తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ కంటెంట్ కోసం చూస్తున్నా వారి కోసం టమాటా ఒక చక్కటి పరిష్కారం కూడా తెలియజేయడం జరిగింది. అధిక బరువు ఉన్న వారికి టమాటా ఒక చక్కటి మెడిసిన్ గా కూడా పనిచేస్తుందని వైద్యులు తెలియజేయడం జరుగుతుంది.