బ్లాక్ మనీ పై వేసిన victory Venkatesh

Written by 24newsway.com

Published on:

బ్లాక్ మనీ పై సెటైర్ వేసిన victory Venkatesh . ఈ సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూలను సాధిస్తూ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వెంకటేష్ గారి సినీ కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించడమే కాక victory Venkatesh గారి కెరియర్ లో మొదట 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా భారీవసుల దిశగా దూసుకుపోతూ ప్రస్తుతానికి 250 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ పండితుల విశ్లేషణ.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారు ఈ సినిమాని నిర్మించడం జరిగింది.. ఈ సినిమాతో పాటు దిల్ రాజు గారు గేమ్ చేంజర్ రామ్ చరణ్ . హీరోగా నిర్మించడం జరిగింది. గేమ్ చేoజర్ మూవీ అనుకున్నంతగా అడకపోయినా సంక్రాంతికి వస్తున్నాం మూవీ దిల్ రాజు గారికి భారీ లాభాలను అందించిందని చెప్పవచ్చు.

దిల్ రాజు గారి మీద త్రీ డేస్ బ్యాక్ ఐటీ అధికారులు రైడ్ చేయడం జరిగింది. ఇలా ఐటి అధికారులు ఒకేసారి దిల్ రాజు గారి మీద ఐటి రైడ్ చేయడానికి కారణం దిల్ రాజు గారు గేమ్ చేజర్ మూవీకి మొదటి రోజునే 150 కోట్ల వసూలు వచ్చాయని పోస్టర్ విడుదల చేయడం. దీనితోపాటు సంక్రాంతికి వస్తున్నాం మూవీ 150 కోట్ల వసూలు చేసిందని పోస్టర్ ద్వారా తెలియజేయడం వలన ఐటీ అధికారులు దిల్ రాజు మీద ఐటి రైట్స్ చేయడం జరిగింది గత మూడు రోజులుగా దిల్ రాజు గారి నివాసంలో ఐటి అధికారులు సోదాలు చేయడం జరుగుతుంది.  దిల్ రాజుతోపాటు మైత్రి మూవీ మేకర్స్ మీద కూడా ఐటి అధికారులు . దాడులు చేయడం జరిగింది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమా 200 కోట్ల రూపాయలు వసూలు చేసిందని పోస్టర్ విడుదల చేసి చెప్పడం దీనికి కారణం .

రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ 250 కోట్లు వసూలు చేసిన సందర్భంగా హీరోvictory Venkatesh డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ గారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు కొన్ని ఫన్నీ సమాధానాలు చెప్పి అందరిని నవ్వించడం జరిగింది.. ఈ ప్రెస్ మీట్ చాలా ఫన్నీ క్యూషన్స్ తో మరియు వెంకటేశ్ గారు ఇచ్చే ఫన్నీ ఆన్సర్ తో చాలా బాగా జరిగింది.

ఈ ప్రెస్ మీట్ లో బ్లాక్ మనీ గురించి ఒక విలేకరి వెంకటేష్ గారిని అడగడం జరిగింది. దానికి వెంకటేష్ గారు బదిలీస్తూ నేను అంతా వైట్ మనీనే తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఇచ్చేది కొంత ఆ కొంతలో బ్లాక్ మనీ ఉండదు అంతా వైట్ మనీ అని ఫన్నీగా సమాధానం చెప్పడం అందరిని నవ్వించడం జరిగింది. ఇలా ప్రెస్ మీట్ చాలా నవ్వుతూ నవ్విస్తూ జరగడం మరో విశేషం. అది అసలు ప్రెస్ మీట్ లా అనిపించలేదు సరదాగా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటునట్లు ఉన్నది. వెంకటేష్ గారు స్టేజ్ పైన చైర్లు వేస్తే వాటి మీద కాకుండా సరదాగా స్టేజి చివరన కూర్చొని విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మరో విశేషం. వెంకటేష్ గారు అలా స్టేజి మీద కూర్చుంటే మనము మన ఫ్రెండ్స్ తోని పిట్టగోడ మీద కూర్చొని మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. దట్ ఇస్ వెంకటేష్. సింప్లిసిటీకి మారుపేరు విక్టరీ వెంకటేష్ అని మరోసారి నిరూపించుకోవడం జరిగింది.

Read More

 

🔴Related Post