కత్తి పట్టి మాస్ మూవీతో విజయ్ దేవరకొండ

Written by 24newsway.com

Published on:

విజయ్ దేవరకొండ ఈ మాట వినంగానే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో గుర్తు వస్తాడు. తెలుగు అభిమానులు అందరూ విజయ్ దేవరకొండ న ముద్దుగా రౌడీ స్టార్ అని అంటారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి మూవీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన యాక్టింగ్ తో మంచి ఫాలోయింగ్ సంపాదిస్తున్నాడు విజయ్ దేవరకొండ. చాలా తక్కువ టైంలోనే విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ గా ఎదిగాడు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కెరియర్ స్టార్టింగ్ లో వరసబెట్టి హిట్ లను కొట్టాడు .తన స్టార్ డం ను అనంతంగా పెంచేసుకున్నాడు పెంచేసుకున్నాడు ఈ మధ్యన మాత్రం విజయ్ దేవరకొండ నటించిన ప్రతి సినిమా పరాజయం ఫాల అవుతుంది. విజయ్ దేవరకొండ ఈ మధ్యన నటించిన సినిమాలో ఒక్క ఖుషి సినిమా మాత్రమే యావరేజ్ టాక్ ను సొంతం చేతుకుంది.

సరైన హిట్ కోసం గత కొంతకాలంగా విజయ దేవరకొండ ఎదురుచూస్తున్నాడు .ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో వచ్చి హిట్ కొడతాడు అనుకుంటే ఆ సినిమా కూడా పరాజయం అయింది. అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు తాను నటించే సినిమాల మీద ఫోకస్ చేయడం జరిగింది ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే విజయ్ దేవరకొండ తన మరో సినిమాను కూడా ప్రకటించడం జరిగింది. విజయ దేవరకొండ గౌతమ్ తిన్నమారి దర్శకత్వంలో చేసే సినిమా షూట్ లో కూడా ఆల్రెడీ పాల్గొంటున్నాడు.

విజయ్ దేవరకొండ తన నూతన సినిమాను రాజా గారు రాణి గారు అనే మూవీ టైటిల్ తో రవి కిరణ్ అనే నూతన డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ తెలుగు బ్యానర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారు నిర్మించబోతున్నారు. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు గారి బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా గాని దాదాపు హిట్ ని అందుకుంటుందని ఇండస్ట్రీలో ఒక సెంటిమెంటు కూడా ఉంది. దిల్ రాజు గారి జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుందని ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకుంటున్నారు. కొంతమంది నూతన దర్శకులు కూడా దిల్ రాజు గారికి మొదటి కాపీని చూపించి ఓకే అనిపించుకోవడం జరుగుతూ ఉంటుంది ఏమైనా లోపాలు ఉంటే దిల్ రాజు గారు చెప్తారని నూతన దర్శకుల అభిప్రాయం.

ఇంత ఉన్న దిల్ రాజు గారు కూడా ఈ మధ్యన కథల విషయంలో జడ్జిమెంట్ సరిగా ఇవ్వలేకపోతున్నారు అందుకే తాను నిర్మించిన కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుని ఎలాగోలా ప్రాఫిట్ వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దిల్ రాజు గారు నిర్మించిన గుంటూరు కారం మరియు విజయ్ దేవరకొండ గారు నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలు. ఈ రెండు సినిమాల కథలు అంతగా బాగా లేకపోయినా గాని హీరోల స్టాండ్ ద్వారా ఎలాగోలా నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్కు నష్టాలు రాకుండా ఆడాయి.

Read More

Leave a Comment