weight gain habits : బరువు పెరగడం అనేది చాలామందిని వేధించే సమస్య కొందరికి ఆరోగ్య సమస్యలు కారణంగా సంభవించినప్పటికీ ఎక్కువ మందికి వారు రోజు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం అవుతుంది. మనం చేసే చిన్నచిన్న పొరపాట్లు నిర్లక్ష్యంగా తీసుకునే ఆహారం జీవన శైలిలో మార్పు క్రమంగా మన బరువును పెంచుకుంటూ పోతాయి. ఈ బరువు పెంచే అలవాటులను గుర్తిస్తూ మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్
ఆహారం విషయానికొస్తే చాలామంది సమయం లేకపోవడం వల్ల వేరే కారణం వల్ల సరైన ఆహారం తీసుకోరు దీని బదులుగా జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ లేదా అధిక క్యాలరీలో ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటారు. పిజ్జాలు బర్గర్లు ఫ్రెంచ్ ప్రైస్ ఆహార పదార్థాలు కోవులు చక్కెరలో అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోయినా అధిక మొత్తంలో కేలరీలు మాత్రం చేరుతాయి. ఇది క్రమంగా బరువు పెరగడానికి దారి తీస్తుంది.
భోజనం చేసే సమయాలు
చాలామందికి భోజనం చేసే వేళలు సరిగా వుండవు ఒక రోజు ఉదయం 8 తింటే మరో రోజు 11:00 అవుతుంది ఇలా సమయం తినకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. అంతేకాకుండా చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల సమస్య వస్తుంది. రాత్రిపూట జీర్ణ క్రియ నెమ్మదిగా పనిచేస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కొవ్వుగా మారే అవకాశం ఉంది నిద్రపోయే ముందు భార్య తినడం కూడా బరువు పెరగడానికి ఒక కారణం.
శీతల పానీయాలు
ఇక పానీయా విషయానికి వస్తే చాలామంది శీతల పానీయాలు చక్కెర గా కలిపిన జ్యూసులు ఇతర తీపి పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు వీటిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ పోషక విలువలు మాత్రం తక్కువ ఉంటాయి వీటిని తాగడం వల్ల కడుపు నిండుగా ఉండే భావన కలుగుతుంది. కానీ శరీరానికి మాత్రం అధిక మొత్తంలో చక్కెర చేరుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారి తీసి బరువు పెరగడానికి కారణం అవుతుంది. నీరు తక్కువగా తాగడం కూడా బరువు పెరిగే అవకాశం ఉంది నీరు జీర్ణ క్రియను మెరుగుపరచడానికి మరియు ఆకలి నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్ గురవడం కాకుండా బరువు కూడా పెరిగే అవకాశం ఉంది.
శ్రమ పడకపోవటం
జీవనశైలి ల్లో వచ్చే మార్పులు కూడా బరువు పెరగడానికి ముఖ్య కారణాలు చాలామంది శరీరక శ్రమ లేకుండా జీవిస్తున్నారు రోజంతా కూర్చొని ఉండటం వల్ల ఏ పని చేయకపోవడం ఇలా ఉండేవారు కొవ్వు పేరుకుపోయిన బరువు పెరుగుతారు. కనీసం రోజుకు 30 నిమిషాలైనా వ్యాయామం చేయడం మంచిది.
నిద్రలేమి సమస్య
నిద్ర సరిగా లేకపోవడం కూడా బరువు పెరగడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఒక కారణం అవుతుంది నిద్రలేమి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆకలి నియంత్ర తప్పుతుంది మరి ఎక్కువ తినాలనిపిస్తుంది తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతారు ఇలా చేయడం వల్ల బరువు పెరగడానికి దారి తీస్తుంది కాబట్టి రోజుకి 7 – 8 గంటలు నిద్రపోవడం మంచిది.
అధిక ఒత్తిడి weight gain habits
ఒత్తిడి కూడా బరువు పెంచే ఒక అంశం చాలామంది ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎక్కువ తింటారు. ముఖ్యంగా తీపి మరియు కొవ్వు పదార్థాలను తింటారు దీనిని ఎమోషనల్ ఈటింగ్ అంటారు ఒత్తిడి సమయంలో విడుదల అయ్యే కార్టిసాల్ హార్మోన్ కూడా బరువు పెరగడానికి సహాయపడుతుంది కాబట్టి ఒత్తిడిని నియంత్రించడం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని ఉంచుకోవడం ముఖ్యం.
ఈ బరువు పెంచే అలవాటులను గుర్తించి వాటిని క్రమంగా మార్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవచ్చు మరియు అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సరైనవేలకు భోజనం చేయడం తగినంత నీరు తాగడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తగినంత నిద్ర పోవడం ఆరోగ్యకరమైన జీవితానికి ముఖ్యమైనవి ఈ మంచి అలవాటులను అలవర్చుకోవడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవచ్చు దీని ద్వారా ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా ఉంటారు.
గమనిక ఇది సోషల్ మీడియా సమాచారం మాత్రమే మేము కొన్ని అధ్యయనాల ప్రకారం సంబంధిత నిపుణుల అందించిన వివరాల ప్రకారం ఈ వివరాలు అందించాం వ్యక్తుల ఆరోగ్యాని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మంచిది.