Weight loss drink : ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో తెలుసు. అయితే చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. నిజంగా సమస్యనుండి బయట పడాలంటే చాలా కష్టం అందుకని ఎప్పుడు కూడా ఆరోగ్యం విషయం జాగ్రత్తగా ఉందండి. బరువు తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమే అందుకే ఎప్పుడు కూడా బరువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అయితే అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు ఈ విధంగా ఫాలో అయితే బరువు తగ్గొచ్చు.
ఎలానో ఎప్పుడు తెలుసుకుందాం.
మీరు తీసుకునే ఆహారం మీ జీవన విధానం మీ అలవాట్లు ఇవన్నీ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి లేదంటే అనవసరంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మీరు చేసే చిన్న తప్పు పెద్ద సమస్యకు కారణం అవుతుంది.
మీరు కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మీరు కూడా ఈ చిట్కాలను చూసేయండి నిజంగా మనం ఉపయోగించే మూలికలు అద్భుతమైన లాభాలను తీసుకువస్తాయి. వంట గదిలో వాడే జీలకర్ర మెంతులు మొదలగు ఎన్నో ఆహార పదార్థాలు ఆరోగ్యానికి కాపాడుకునేలా చేస్తాయి. నిజంగా ఇది జీర్ణ సమస్యలు మొదలు చర్మ సమస్యలు వరకు ఎన్నో వాటిని నయం చేస్తాయి. అలానే అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్లకు కూడా మన వంటింట్లో ఉండే వంట సామాన్లు చక్కటి ఔషధం.
ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం రెగ్యులర్గా వ్యాయామం చేయడం కూడా బరువు తగ్గించడానికి సహాయపడతాయి. దాంతో పాటు మీరు ఈ చిట్కాలను కూడా ఫాలో అయితే చక్కగా బరువు తగ్గుతారు. ఈ రెసిపీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూడండి. జీలకర్ర వాము సోంప్ నీళ్లలో మిక్స్ చేసి రెసిపీ ని మనం తయారు చేసుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. బరువు మాత్రమే కాదు రోగ నిరోధ శక్తిని కూడా ఇది పెంచుతుంది. దీనిని తాగడం వల్ల ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి అనేది కూడా చూసేద్దాం.
జీలకర్ర వల్ల కలిగే లాభాలు….
జీలకర్ర గురించి చూస్తే జిలకరలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా జిలకరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. జిలకర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది శరీరంని ఈ జిలకర శుభ్రపరుస్తుంది అలానే మెట్టబానిజంను కూడా పెంచుతుంది.
వాము వలన కలిగే ప్రయోజనాలు
వాము వలన మనకు కలిగే ప్రయోజనాలను చూస్తే ఇందులో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదం కూడా వాము ఆరోగ్యానికి మంచిదాన్ని తెలియజేస్తుంది. బరువు తగ్గడానికి కూడా వాము సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెట్టబాలిజంను కూడా పెంచుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఈ వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆస్తమ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా వాము చాలా మంచిది.
సోంపు వలన కలిగే లాభాలు
చాలామందికి సోంపు వల్ల కలిగే లాభాలు తెలియవు సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైటో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. డైటరీ ఫైబర్ కూడా ఇందులో అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది చాలా సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియను బాగా చూసుకోవడానికి సోంపు ఎంతగానో పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాట్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ను బ్రేక్ చేయడానికి సహాయపడతాయి. అలానే సోంపులో డైయూ రేటికు గుణాలు ఉంటాయి. ఒంట్లో ఉండే చెడు పదార్థాలను బయటకు పంపగలరు. సోంపు ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి వాడవచ్చు. ఈ విధంగా డ్రింక్ ని తయారు చేసుకుని ఉదయాన్నే తాగడం మంచిది.
కావలసిన పదార్థాలు..
- ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
- ఒక టేబుల్ స్పూన్ సోంపు
- ఒక టేబుల్ స్పూన్ వాము
- ఒక కప్పు వేడి నీళ్లు
తయారు విధానం..
ఒక కప్పు వేడి నీళ్లు తీసుకొని అందులో జీలకర్ర వాము మరియు సోంపు వేసి నానబెట్టండి. అయితే ఇది ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకోవాలి. రాత్రంతా కూడా దీనిని అలా వదిలేయాలి. అప్పుడు నీళ్లు మొత్తం వీటిలో ఉండే గుణాలను పీల్చుకుంటూ ఉంటాయి దానితో తర్వాత రోజు మీరు తాగాక చక్కటి ప్రయోజనం పొందవచ్చు.
రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే వడకట్టేసేయండి నీటిని. ఆ నీళ్లలో కొంచెం తేనె వేసుకుంటే రుచి బాగుంటుంది. ఉదయాన్నే మీరు లేచిన తర్వాత కాలి కడుపుతో ఈ డ్రింకు ను తీసుకోండి. దాంతో చక్కగా మీరు బరువు తగ్గవచ్చు.
గమనిక : ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యం సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించాలని ఉత్తమ మార్గమని గమనించగలరు.