Weight Loss-ఆకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా ఆ కారణాలు తెలుసుకోండి: చాలా మంది ఈ కాలం లో చూస్తుండ గానే బరువు పెరగడం జరుగుతుంది. ఆ బరువుని తగ్గించుకోవడం కోసం చాలామంది జిమ్ మరియు యోగా చేస్తూ ఉంటారు అది మనం రోజు చూస్తూనే ఉంటాము. కొంతమంది అయితే బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ నానా తిప్పలు పడుకుంటారు అలా చేసిన గాని బరువు తగ్గకపోగా మరింత బరువు పెరగడం మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము. సన్నగా కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఒత్తిడికి గురవుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఈ కాలంలో. అయితే ఉన్నట్టుండి బరువు పెరగడానికి గల కారణాలు ఏమిటి అవి ఎలా మన మీద ప్రభావం చూపిస్తాయో అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
అకస్మాత్తుగా బరువు పెరగడానికి కారణాలు ఇవే
శరీరంలో హార్మోన్ల లో వచ్చే మార్పుల కారణంగా మన శరీరంలో జీవ జీవ కియా ల పనితీరు నెమ్మదించడం వలన బరువు పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలాగే మనలో ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు శరీరంలో కార్డ సాల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇది మన బరువును అమాంతం పెంచేస్తుంది/ కొంతమంది రుతుక్రమం సమయంలో బరువు పెరుగుతారు వీటితోపాటు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ప్రొజెస్టి రాన్ హార్మోన్ స్థాయిలలో ఈ సమయంలో సంభవించే మార్పుల వలన బరువు లో కూడా మార్పు వస్తుంది.
కొంతమంది విపరీతమైన ఒత్తిడిని తగ్గించే మందులను వాడటం వల్ల మరియు కొంతమంది గర్భ నిరోధక మందులను కూడా వాడుతుంటారు అయితే వీటి వలన కూడా బరువు పెరగడానికి అవకాశం ఉంది. అందుకే అనవసరంగా ఎక్కువ మందులను వాడడం మానుకోవాలి అంతేకాదు కొంతమందిలో థైరాయిడ్ సమస్య వల్ల కూడా శరీరం బరువు విపరీతంగా పెరుగుతుంది ఆరోగ్య వ్యవస్థ సంక్రమంగా ఉండాలంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు సరిగా ఉండాలి. థైరాయిడ్ గ్రంథిలో దాని పనితీరులో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చిన శారీరక బరువు విపరీతంగా పెరుగుతుంది.
ఇక కొంతమంది కొన్నిసార్లు ఎలాంటి ఆకలి లేకపోయినా కంటికి కనిపించిన మనసుకు నచ్చిన ప్రతి ఒక్కటి తినేస్తూ ఉంటారు అవసరానికి మించి జంక్ ఫుడ్ తినే వారిలోనూ బరువు సమస్య అనేది వస్తుంది కొందరు ఆహారం రుచిగా ఉండాలని ఆకర్షణీయంగా కనిపించాలని రకరకాల రంగులను కలుపుతుంటారు వాటి వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటది
కొంతమంది సరిగ్గా నిద్రపోరు నిద్రలేమి సమస్యకు చాలామంది మానసిక స్థితి దెబ్బతింటుంది ఎక్కువ నిద్రపోని వారిలో బరువు పెరిగే ప్రభావం ఆహారం పైన పడుతుంది వారి ఆకలి ఊహించని విధంగా పెరుగుతుంది దీంతో వారు అతిగా తినే అవకాశం ఉంటుంది ఫలితంగా బరువు పెరగడం కూడా జరుగుతుంది కాబట్టి నిద్రలేమి సమస్య కూడా బరువు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు అయితే పైన పేర్కొన్న సమస్యలన్నీ ఏ సమస్య మీ బరువులు పెరగడానికి కారణం అవుతుందో గుర్తించి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన బరువు అదుపులో తెచ్చుకోవచ్చు మరియు ఆరోగ్యంగా జీవించవచ్చు.Weight Loss