దక్షిణాది ఇండస్ట్రీలో డబ్బు సంపాదనలో నెంబర్ వన్ హీరో ఎవరు

Written by 24newsway.com

Published on:

దక్షిణాది ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో: దక్షిణాది ఇండస్ట్రీలో డబ్బు సంపాదించడంలో నెంబర్ వన్ హీరో ఎవరో మీకు తెలుసా. దేశంలో అత్యంత ఐశ్వర్యవంతుడైన హీరో ఎవరంటే షారుక్ ఖాన్ అనే పేరును అందరూ చెబుతుంటారు .అయితే దక్షిణ భారత దేశంలో మాత్రం అత్యంత ఐశ్వర్యవంతుడైన హీరో చిరంజీవి మరియు రజనీకాంత్ మరియు మోహన్ లాల్ అని చెబుతారు కానీ వీళ్ళందరూ కాదు వీళ్ళందరి కంటే ఎక్కువ ఐశ్వర్యవంతుడు మన కింగ్ అక్కినేని నాగార్జున

మన అక్కినేని నాగార్జున గారు సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం పై ఆయన ఎక్కువగా డబ్బు సంపాదించడం జరుగుతుంది. అక్కినేని నాగార్జున గారు చాలా సంవత్సరాల నుంచి సినిమాలతో పాటు అనేక రకాల బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ ఒక మంచి బిజినెస్ మాన్ గా పేరు పొందారు.

నాగార్జున గారు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద దృష్టి సారించారు. నాగార్జున గారికి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కన్నా ఇతర వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయమే ఆయనకు ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది .ఒక నివేదిక ప్రకారం సంవత్సరానికి నాగార్జున గారు 30 కోట్ల నుండి 50 కోట్ల వరకు సంపాదిస్తున్నారని ఆ నివేదిక ప్రకారం తెలుస్తుంది కానీ నాగార్జునకు దగ్గర బంధువులు అయిన వారు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున గారికి సుమారు సంవత్సరానికి 100 కోట్ల పైగానే సంపాదిస్తారని ఒక రూమర్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో. ఉన్నది.

నాగార్జున గారి నికర ఆస్తి విలువ 3600 కోట్లు

ప్రస్తుతానికి నాగార్జున గారి నికర ఆస్తుల విలువ సుమారు 3600 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. నాగార్జున ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ విలువ దాదాపు 600 కోట్ల నుండి 700 కోట్ల మధ్యలో ఉంటుంది. అలాగే కింగ్ నాగార్జున గారు నివసించే ఇల్లు 50 కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా. వీటితోపాటు నాగార్జున గారికి హైదరాబాద్ సిటీకి చుట్టుపక్కల ఫామ్ హౌస్ లు మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో నాగార్జున గారికి సుమారు 500 ఎకరాలు భూమి ఉందని తెలుస్తుంది. అలాగే నాగార్జున గారికి హైదరాబాద్ సిటీలో మాత్రమే కాకుండా ఇండియాలో చాలా సిటీలలో భూములు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే నాగార్జున గారికి రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి నాగార్జున గారికి సంబంధించిన రెస్టారెంట్లు హైదరాబాదులోనే కాకుండా ఇండియాలో ప్రముఖ నగరాలలో ఉన్నాయి అని తెలుస్తుంది. రీసెంట్గా కూలగొట్టిన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విలువ సుమారు 600 కోట్ల గా ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఇంతకుముందు నాగార్జున గారు మా టీవీని కూడా స్థాపించి దాన్ని కూడా విజయవంతంగా నడిపించడం జరిగింది ఆ తర్వాత మా టీవీని స్టార్ టీవీ వాళ్లకు అమ్మి సుమారు 2500 కోట్లు తన వాటాగా తీసుకోవడం జరిగింది అప్పట్లో ఈ వార్త చాలా సంచలనంగా మారింది. మన కింగ్ నాగార్జున గారు సినిమాలలో మాత్రమే కింగ్ కాదు బిజినెస్ లో కూడా కింగ్ అని ఆల్రెడీ నిరూపించుకోవడం జరిగింది. దట్ ఇస్ కింగ్ నాగార్జున.

Read More>>

Leave a Comment