Why do kidney stones form?

Written by 24 News Way

Published on:

Why do kidney stones form? : కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి. ప్రస్తుతం ఉన్న కాలంలో మన జీవన శైలి పూర్తిగా మార్పు వచ్చింది దీనివల్ల తినడానికి మనం నిద్రపోవడానికి సమయం దొరకడం లేదు అంతే కాదు మన శరీరానికి తగినంత శ్రమ కూడా ఉండటం లేదు ఇవన్నీ వివిధ రకాల వ్యాధులకు కారణంగా అవుతున్నాయి ప్రస్తుతం మనం కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సాధారణ సమస్యగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు. చాలామంది వ్యాధితో బాధపడుతున్నారు అయితే మనం మన దినచర్యతో పాటు నిత్యం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది సాధారణంగా అయింది చాలామందికి ఈ సమస్య ఉంది కాల్షియం యూరిక్ యాసిడ్ వండుకొని ఖనిజాలు శరీరంలో అధికంగా పేరుకుపోయి మూత్రం ద్వారా అవి బయటకు వెళ్లేటప్పుడు అవి క్రమంగా పేరుకుపోయి చిన్న చిన్న గట్టి గడ్డలుగా ఏర్పడతాయి ఈ గడ్డలు రాలుగా మారుతాయి.

మూత్రపిండంలో రాయి ఉంటే రోజుకి కడుపు లేదా నడుము మూత్రనాలంలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడతారు కొన్నిసార్లు వాంతులు వికారం లేదా మూత్ర విసర్జన సమయంలో మంట వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మూత్రపిండంలో రాయి ఉంటే రోగి భరించలేని నొప్పితో ఉంటాడు ఈ నొప్పి తరచుగా రాత్రి సమయంలో వస్తుంది దీంతో రోగికి తినాలని కోరిక కూడా తగ్గుతుంది ముదురు పిండాల్లో రాళ్లు ఎలా ఎందుకు ఏర్పడతాయో తెలుసుకుందాం వాటిని ఎలా నియంత్రించాలో చూద్దాం.

మూత్రపిండాలు రాళ్లు ఏర్పడటానికి కారణాలు Why do kidney stones form?
మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాటిలో పెద్ద కారణమేంటంటే నీరు తక్కువ తాగడం శరీరానికి కావాల్సిన అంత నీరు తాగకపోవడం వల్ల మూత్రపిండంలో రాళ్లు ఏర్పడతాయి. దీంతోపాటు ఉప్పు టీ చాక్లెట్ పాలకూర వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పాటు ప్రమాదం ఉంటుంది కుటుంబంలో ఎవరైనా గతంలో రాళ్ల సమస్య ఉంటే జిన్నుపరమైన కారణాలవల్ల ఇతరులు కూడా దీంతో బాధపడవచ్చు. కొంతమంది తరచుగా మూత్రం ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు ఇది కూడా మూత్రపిండంలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది.

మూత్రపిండాలు రాళ్లను ఎలా నివారించవచ్చు.
మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళను నివారించవచ్చు ప్రతి ఒక్కరు పుష్కలంగా నీరు తాగాలి ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు నీరు తాగాలి దీని ద్వారా శరీరంలో మురికి బయటకు వెళ్తుంది ఆహారాన్ని సమతుల్యంగా తేలికగా ఉండేలా చూసుకోవాలి తక్కువ ఉప్పు అధిక ప్రోటీన్ ఆహారాలు తినండి బయట ఫాస్ట్ ఫుడ్ లేదా ప్యాక్ చేసిన వస్తువులకు దూరంగా ఉండటం మంచిది. మూత్ర విసర్జన చేసే సమయంలో మంట నొప్పితో తరుచుగా ఇబ్బంది పడుతుంటే మీరు కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించండి ఎప్పుడు ఆపుకోకండి లేకుంటే మూత్రపిండాలు ఇన్ఫెక్షన్లు రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post